కస్తూర్బా విద్యాలయంలో వసతుల కల్పనపై శింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
నియోజకవర్గంలోని పుట్లూరు మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా విద్యాలయాన్ని ఎమ్మెల్యే తనిఖీ చేశారు. విద్యార్థులుకు అందించు వంటల్లో నాణ్యమైన నిత్యావసర సరుకులను వాడాలని సిబ్బందికి తెలిపారు. శుభ్రం చేయని వాటర్ ఫిల్టర్ ఎలా వాడుతారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు .విద్యార్థులకు సాయంత్రం వేళ ఇచ్చే బూస్టులో నాణ్యత లేదు అని సీరియస్ అయ్యారు. అలాగే విద్యాలయ భవనంపై మధ్యలోనే ఆపేసిన నిర్మాణాలను పరిశీలించారు. గత వైసీపీ ప్రభుత్వం నాడు-నేడు అని ప్రగల్భాలు పలికి, అర్ధాంతరంగా భవన నిర్మాణాలు ఆపి, విద్యాబోధన కుంటుపడేటట్లు చేశారని ఎమ్మెల్యే మండిపడ్డారు.విద్యాలయంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. విద్యాలయంలో విద్యార్థుల వసతుల కొరతపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు..
అంతకుమందు ఎస్సీ వసతి గృహం ఏర్పాటు కు చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ అధికారులుకు సూచించారు.
దాదాపు దశాబ్ద కాలం పైగా ప్రభుత్వం తరపున కళాశాల కొరకు కట్టిన భవనాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. రోడ్డు సౌకర్యం లేదు. కొండప్రాంతం కావడంతో ఇక్కడ తగిన సదుపాయాలు లేక సం.లుగా ప్రభుత్వం నిర్మించిన కట్టడాలు ఇలా నిర్వీర్యంలో ఉండటాన్ని ఎమ్మెల్యే గమనించారు. నిర్వీర్యంగా ఉన్న భవనాన్ని ఎస్సీ వసతి గృహం ఏర్పాటు చర్యలు తీసుకోవాలని మండల విద్యాశాఖ అధికారికి ఆదేశించారు. అలాగే రోడ్డు సౌకర్యం, కాంపౌండ్ గోడ వంటి ఇతర సదుపాయాలు కొరకు అధికారులు నివేదిక అందించాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.