తెలుగుదేశం పార్టీలో కేశినేని నాని బ్రదర్స్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరింది. తిరువూరు బహిరంగ సభ ఏర్పాటు విషయంలో తలెత్తిన వార్ మరింత ముదిరింది. తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ఎంపీ పదవితో పాటు టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారు తెలుగు దేశం పార్టీ కి నా అవసరం లేదు అని భావించిన తరువాత కుడా నేను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదు అని నా భావన వ్యక్తం చేశారు.
కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి గౌరవ లోకసభ స్పీకర్ గారిని కలసి నా లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి దానిని ఆమెదింప చేయించుకుని ఆ మరుక్షణం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియ చేస్తున్నానని వెల్లడించారు. కేశినేని బ్రదర్స్ మధ్య విభేదాలు ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుకు తీవ్ర తలనొప్పిగా మారింది.
చంద్రబాబుగారి ఆదేశాల మేరకు మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజా గారు ,ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు నెట్టం రఘురాంగారు మరియు మాజీ ఎంపీ కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు కొనకళ్ల నారాయణ గారు నన్ను కలసి 7 వ తేదీన తిరువూరు పట్టణంలో జరిగే సభకు వేరే వారిని ఇంచార్జ్ గా చంద్రబాబు గారు నియమించారని కాబట్టి ఆ విషయంలో నన్ను కలగ చేసుకోవద్దని చంద్రబాబు గారు నాకు చెప్పమన్నారని తెలియచేసారు .
అట్లాగే రాబోయే ఎన్నికలో నా స్థానంలో విజయవాడ లోకసభ అభ్యర్థిగా వేరేవారికి అవకాశం ఇవాలనుకుంటున్నారని కాబట్టి ఎక్కువగా పార్టీ వ్యవహారలో నన్ను జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు గారు ఆదేశించారని నాకు తెలియచేసినట్లు తెలిపారు. అధినేత ఆజ్ఞలను తూచా తప్పకుండా శిరసావహిస్తానని వారికి నేను హామీ ఇచ్చానని పేర్కొన్న నాని తాజా నిర్ణయంతో టీడీపీలో కలకలం రేపుతోంది.