ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయని అన్నారు. తిరుమల శ్రీవారిని తమ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల ఆమె మీడియాతో మాట్లాడారు. దేశ ప్రగతి కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ తప్పని స్పష్టం చేశారు.