రాష్ట్రాన్ని సీఎం జగన్ అప్పులమయం చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన శంఖారావం సభలో మాట్లాడతూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు కుప్పించారు. టీడీపీ పాలనలో నెలకొక ఐటీ కంపెనీని చంద్రబాబు తీసుకొచ్చారు. ఇప్పుడు జగన్ మాత్రం రోజుకో భూకుంభకోణం, హత్యలు, కిడ్నాప్‌లు జరుగుతున్నాయని ఆరోపించారు. విశాఖను గంజాయి క్యాపిటల్‌గా మార్చారని విమర్శించారు. లాలూచీ పడి విశాఖ ఉక్కును ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మరో రెండు నెలల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే విశాఖ ఉక్కు పరిశ్రమను అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పారు. వచ్చే ఎన్నికలు జగన్ అహంకారానికి, జనం ఆత్మగౌరవానికి మధ్య ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు.