రోడ్ల నిర్మాణంలో ఎక్కడా అలసత్వానికి తావు లేకుండా, నాణ్యతలో రాజీపడకుండా రోడ్లు నిర్మించి.. ప్రమాదరహిత తెలంగాణ దిశగా విస్తృతంగా పనిచేయాలని.. ప్రస్తుతం జరుగుతున్న పనుల్లో జాప్యం జరగకుండా ప్రతీ ఒక్క ప్రాజెక్టుకు ఒక సీఈ స్థాయి అధికారిని స్పెషల్ ఆఫీసర్ గా పెట్టి పనులను మానిటరింగ్ చేయాలని అధికారులకు రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు. సచివాలయంలోని తన ఛాంబర్ లో రోడ్లు, భవనాల శాఖ ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి పలు సూచనలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గుంతలు లేని రోడ్లను ప్రజలకు అందిస్తామని మాటిచ్చామని అందుకోసం ఇప్పడు చేస్తున్న పనులకంటే మరింత వేగంగా పనులు చేయాలని ఆయన అధికారులకు దిశానిర్ధేశం. గత ప్రభుత్వంలో ప్రతిరోజు పదుల సంఖ్యలో ప్రజలు ప్రమాదాల్లో చనిపోయేవారని.. అలాంటి పరిస్థితి తలెత్తకుండా పనిచేయాలని అధికారులకు సూచించారు.