చిక్కుల్లో అలీ.. అధికారులు నోటీసులు.. చర్యలు తప్పవని హెచ్చరిక

Notices issued to actor Ali for undertaking illegal construction without permits
నటుడు అలీకి అధికారులు నోటీసులు ఇచ్చారు. ఫామ్‌హౌస్‌లో అనుమతి లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపట్టారంటూ వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలం ఎక్‌మామిడ గ్రామ పంచాయతీ కార్యదర్శి శోభారాణి నోటీసులు జారీ చేసింది. నిర్మాణాలు ఆపివేయాలని అందులో సూచించారు. ఎక్‌మామిడి రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 345లోని ఫామ్‌హౌస్‌లో అనుమతులు లేకుండా నిర్మాణాలు ఎలా చేపట్టారు. సరైన పత్రాలు సమర్పించి అనుమతులు పొందాలంటూ గతంలోనే అలీకి నోటీసులు ఇచ్చారు. ఆయన స్పందించకపోవడంతో మరోసారి నోటీసులు జారీ చేశారు. తాజాగా ఫామ్‌హౌస్‌లో ఉన్న పనివారికి నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. నిర్మాణాలకు సంబంధించిన ధువపత్రాలను సమర్పించి అనుమతులు పొందాలని.. లేని పక్షంలో చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు.

 

Share this post

submit to reddit
scroll to top