ఒంగోలు లోక్‌సభ టీడీపీ అభ్యర్థి, ప్రస్తుత ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆయన తనయుడు రాఘవరెడ్డితో కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీస్‌లో కలిసిన ఆయన.. తాజా రాజకీయాలపై ఇరువురు చర్చించుకున్నారు. ఈసందర్భంగా ఒంగోలు నియోజకవర్గంలో కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించాలని పవన్‌ను కోరారు. దీనికి జనసేనాని సానుకూలం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో తమ కూటమిదే విజయమని మాగుంట ధీమా వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఇంచార్జీ షేక్ రియాజ్‌తో పాటు టీడీపీ నేతలు ఉన్నారు
పవన్ కళ్యాణ్‌తో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి భేటీ..
