సీఎం జగన్‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. ఆయనపై దాడిచేయడమే మా పనా? మాకింకేం పనులు లేవా? అని తీవ్రంగా మండిపడ్డారు.. అందరిమీద దాడి చేసే మీ మీద దాడిచేసే ధైర్యం ఎవరికైనా ఉంటుందా ? వాళ్లను మీరు బతకనిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌కు గాయమైతే .. ఈ రాష్ట్రానికి గాయమా? రాష్ట్రంలో లక్షలాది మంది యువతకు ఉపాధి లేకపోతే అది గాయం కాదా ? అని ప్రశ్నించారు. చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే అది గాయం కాదా.. 15 ఏళ్ల అమర్నాథ్‌ను పెట్రోల్ పోసి కాల్చేస్తే అది గాయం కాదా? అని మండిపడ్డారు. ఇలాంటి గాయాలన్నీ వదిలేసి జగన్‌దే గాయమా.. అసలు ఏం జరిగిందో ఆ గోల , ఆ మాయ ఏంటో ఎవరికి అర్ధం కావడం లేదని దుయ్యబట్టారు.
జగన్‌పై దాడి చేయడమే మాకు పనా.. ఇంకేం పనుల్లేవా?
