జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరం పర్యటన వాయిదా పడింది. విష్ణు కాలేజీ ప్రాంగణంలో ఉన్న హెలీప్యాడ్‌లో పవన్ ప్రయాణించే హెలీకాప్టర్ ల్యాండింగ్‌కు ఆర్ ఆండ్ బి అధికారులు అనుమతులు నిరాకరించారు. దూరంగా ఉన్న భవనాన్ని సాకుగా చూపిస్తూ అభ్యంతరపెట్టడం వెనుక అధికార పార్టీ ఒత్తిళ్లు ఉన్నట్లు అర్థమవుతోందని జనసేన నేతలు మండిపడుతున్నారు. గత కొన్నేళ్లుగా విష్ణు కాలేజీలో ఏర్పాటు చేసి ఉన్న హెలీప్యాడ్‌ను భీమవరం పర్యటనకు వచ్చిన పలువురు ప్రముఖుల కోసం వినియోగించారు. ఇప్పుడు మాత్రం పవన్ కల్యాణ్ పర్యటన విషయంలో అభ్యంతారాలు చేప్పడం విచిత్రంగా ఉందని ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ఇదే తరహాలో అమలాపురంలోనూ ఆర్ అండ్ బి అధికారులు అనుమతుల విషయంలో మోకాలడ్డుతున్నారని ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపుల కోసం అధికార యంత్రాంగాన్ని వాడుకోవడాన్ని ఖండించారు.
జగన్ ప్రభుత్వం నియంతలా వ్యవహారిస్తోందని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పవన్ కల్యాణ్ ఏ ప్రాంతానికైనా రోడ్డు మీద వచ్చినా, హెలికాప్టర్లో వచ్చినా పదే పదే అడ్డుకోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. జనసేనాని అంటే భయమా లేక దిక్కుమాలిన పాలన ముగిస్తాడని ఆందోళనా అని దుయ్యబట్టారు. నీ “సిద్ధం” పెద్ద అబద్దం. ఇంత పరికికోడివి ఏంటీ జగన్ అంటూ మండిపడ్డారు.