ఏపీలో సీట్ల సర్దుబాటుపై తెలుగుదేశం-జనసేన పార్టీలు కసరత్తు మొదలు పెట్టాయి. ఇందులో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలి. ఎక్కడెక్కడ ఎవరు పోటీ చేయాలి. ఎవరిని బరిలోకి దించాలన్న దానిపై ఇరువురి మధ్య సుదీర్ఘం చర్చ జరిగింది. ఆదివారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో రెండు సార్లు భేటీ అవ్వడం తీవ్ర చర్చనీయాశమైంది. ఇప్పటికే చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 8వ తేదిన మరో సారి భేటీ కానున్నారు. అనంతరం సీట్ల సర్ధుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో, బహిరంగ సభల ఏర్పాటుపై స్పష్టత రానుంది.
చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ.. సీట్ల సర్దుబాటుపై సుదీర్ఘ చర్చ
