పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌పై తీవ్ర విమర్శలు చేశారు శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్. సిక్కుల చరిత్ర తెలియని వ్యక్తి అంటూ పంజాబ్ సీఎంపై విరుచుకుపడ్డారు. అందుకే అతన్ని సిక్కుగా పరిగణించడం లేదని అన్నారు. సిక్కు అని చూపించడానికి తలపాగా ధరిస్తాడు. అతనికి సిక్కుల చరిత్ర తెలియదు. మేము అతనిని చూసినప్పుడు, ప్రకటనలు వింటున్నప్పుడు బాధగా ఉంటుందని ఆయన చెప్పారు. దేశంలో ముస్లింల జనాభా దాదాపు 18 శాతం ఉంది, కానీ వారు ఐక్యంగా లేనందున వారికి నాయకత్వం లేకుండా పోయిందని… అదే తాము 2 శాతం ఉన్నప్పటికీ… అకల్ తఖ్త్ సాహిబ్ కింద ఐక్యంగా ఉన్నామన్నారు. పంజాబ్ ప్రభుత్వాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నడుపుతున్నారని.. భగవంత్ మాన్ సింగ్ కాదని, బాదల్ పేర్కొన్నారు.