ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “పుష్ప 2: ది రూల్” సినిమాకు టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం అల్లు అర్జున్ హీరోగా, రష్మిక హీరోయిన్‌గా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందింది. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదల కానుంది. సినిమాకు గల భారీ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, ప్రత్యేక షోల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ప్రధానంగా ప్రీమియం క్యాటగిరీ టికెట్ల ధరలను పెంచుకునే అవకాశం కల్పించారు.
“పుష్ప 2” దేశ వ్యాప్తంగా మాత్రమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో కూడా భారీ వసూళ్లను సాధించేందుకు సిద్ధమవుతోంది. డిసెంబర్ 4న రాత్రి గంటలకు బెనిఫిట్ షోతో పాటు అర్థరాత్రి 1 గంట షోకు కూడా అనుమతి ఇచ్చింది. రాత్రి 9.30 షోకు టికెట్ ధరను రూ. 800 గా నిర్ణయించారు. దీనికి జీఎస్టీ అదనంగా చెల్లించాలని స్పష్టం చేసింది. డిసెంబర్ 6 తేది నుంచి 17 వరకు ఐదు సోలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో “పుష్ప 2: ది రూల్” సినిమాకు టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చినందుకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు హీరో అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. ఇది వారికి తెలుగు పరిశ్రమ ఎదుగుదల, శ్రేయస్సు పై ఉన్న దృఢ నిబద్ధతను తెలియజేస్తుందని తెలిపారు. చిత్రపరిశ్రమను బలోపేతం చేయడంలో పవన్ కల్యాణ్ కృషి , మద్దతు అమూల్యమైనదని అల్లు అర్జున్ పేర్కొన్నారు.