భారత స్టార్ అథ్లెట్ పీవీ సింధు ఫోర్బ్స్‌లో తళుక్కుమన్నారు. కాగా ఫోర్బ్స్ తాజాగా ప్రకటించిన జాబితాలో పీవీ సింధు చోటు దక్కించుకున్నారు.అయితే ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా సంపాదించిన 20 మంది మహిళా అథ్లెట్ల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది.కాగా ఈ జాబితాలో పీవీ సింధు రూ.60 కోట్ల సంపాదనతో 16 స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో రూ.199 కోట్ల సంపాదనతో పోలండ్‌కు చెందిన టెన్నిస్ స్టార్ స్వియాటెక్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు.అయితే ఫోర్బ్స్ 2023 జాబితాలో భారతదేశం నుంచి కేవలం పీవీ సింధు మాత్రమే టాప్-20లో నిలిచిన ఏకైక మహిళా అథ్లెట్‌గా ఉన్నారు. కాగా గతేడాది కూడా పీవీ సింధు ఇంతే ఆదాయాన్ని ఆర్జించి 12వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే పీవీ సింధు 2018లో రూ.70కోట్ల సంపాదనతో ఫోర్బ్స్ జాబితాలో అత్యున్నతంగా 7వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.