బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ , జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చిన ఆయనను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ముఖ్యమంత్రి ఆహ్వానించారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్
