దేనికి సిద్ధం జగన్ సారూ?.. అన్నపై షర్మిల విమర్శనాస్త్రాలు

YS Sharmila on CM Jagan

సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మరో సారి విరుచుకుపడ్డారు. కల్లబొల్లి మాటలతో మరో సారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. బాపట్లలో నిర్వహించిన బహిరంగసభలో ఆమె పాల్లొన్నారు. ఈ సందర్భంగా అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీపై విమర్శలు కురిపించారు. దేనికి సిద్ధం జగన్ సారూ? మరో 8 లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా? మళ్లీ బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా ? మళ్లీ ప్రత్యేక హోదాను బీజేపీ దగ్గర తాకట్టు పెట్టడానికి సిద్ధమా? మళ్లీ పూర్తి మద్యపాన నిషేధమని మోసం చేయడానికి సిద్ధమా? 25 లక్షల ఇళ్ళు కడతామని మోసం చేయడానికి సిద్ధమా ? లిక్కర్,మైనింగ్ మాఫియా కు సిద్ధమా ? దేనికి సిద్ధం? అని ప్రశ్నించారు. మీరు సిద్ధమైతే…ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారని షర్మిల పేర్కొన్నారు.వైయస్ఆర్ సంక్షేమ పాలన కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు.

 

Share this post

submit to reddit
scroll to top
స్రవంతి చొక్కారపు సోకుల విందు.. ఫుల్ డోస్‌తో సెగలు పుట్టించేస్తుందిగా! స్టన్నింగ్ లుక్స్‌తో సెగలు పుట్టిస్తున్న శ్రద్ధా కపూర్ సోకుల విందుతో మైమరిపిస్తున్న శ్రీముఖి సొగసైన అందాలతో మైమరిపిస్తున్న మీనాక్షి చౌదరి సొగసైన అందాలతో మైమరిపిస్తున్న దేవర బ్యూటీ జాన్వీకపూర్