కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఏపీ పీసీసీ చీఫ్ మరో సారి విరుచుపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ ఢిల్లీ ఏపీ భవన్‌లోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో కలిసి మహాధర్నాకు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతి సభలో ప్రధాని మోదీ చెప్పారు. దుగ్గరాజుపట్నం పోర్టు నిర్మిస్తామన్నారు. రైల్వేజోన్ ఇస్తామన్నారు. పోలవరం పూర్తి చేస్తామన్నారు. సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తామన్నారు.కానీ విభజన చట్టంలో ఇచ్చిన ఒక్క హామీలను కూడా నేరవేర్చలేదని దుయ్యబట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం ఏపీకి తీరని ద్రోహం చేస్తున్నా సీఎం జగన్, ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు చూస్తూ ఉన్నారని షర్మిల విమర్శించారు. బీజేపీకి గులాంగిరి చేస్తూ ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట తప్పి ద్రోహం చేస్తున్నారని దుయ్యబట్టారు. తమ స్వంత ప్రయోజనాలకోసమే ముఖ్యమంత్రి జగన్ శ్రద్ధ చూపుతున్నారు కానీ ప్రజల గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించారు.