తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సింగపూర్‌కు చెందిన మెయిన్హార్డ్ట్ కంపెనీ ప్రతినిధులు సచివాలయంలో భేటీ అయ్యారు. హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు ను చేపట్టేందుకు తమ ఆసక్తిని ప్రదర్శించారు. వివిధ దేశాల్లో తమ గ్రూప్ చేపట్టిన ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. రానున్న భాగ్యనగరం రూపురేఖలు మానిపోనున్నాయని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని పూర్తి వివరాలతో కూడిన నమూనాలను రూపొందించాలని కంపెనీ ప్రతినిధులకు సూచించారు.
సీఎం రేవంత్ రెడ్డితో సింగపూర్ ప్రతినిధుల భేటీ..
