రాజకీయాలకు గుడ్‌ బై.. నాపై నిఘా ఉంది : గల్లా జయదేవ్

GALLA JAYADEV

రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు గుంటూరు టీడీపీ ఎంపీ ప్రకటించారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని తాను ఎప్పుడూ ఊహించలేదని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తనను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగుతున్న నేపథ్యంలో మౌనంగా ఉండలేకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు. పార్లమెంటులో రాష్ట్ర సమస్యలు, ప్రత్యేక హోదా కోసం తన గళం వినించా. రాజధానిగా అమరావతికే మద్దతిచ్చాను. రైతుల పక్షాన పోరాటం చేశానని గుర్తుచేశారు. పార్టీ గొంతు వినిపించారు. దీనిని దృష్టిలో పెట్టుకొని అనేక కేసులు తమ కంపెనీపై పెట్టారు. ఈడీ నన్ను రెండు సార్లు పిలిచి విచారించింది. నా వ్యారాలలపై నిఘా ఉంది. ఈడీ, సీబీఐ నా ఫోన్‌లు ట్యాప్ చేస్తున్నాయని పేర్కొన్నారు.

కానీ ప్రస్తుతానికి మాత్రమే రాజకీయాలను నుంచి తప్పుకుంటున్నారు గల్లా జయదేవ్ చెప్పారు. 2024లో పోటీ చేయడం లేదు. తాజా నిర్ణయం తాత్కాలికమేనని పేర్కొన్నారు. వనవాసం తర్వాత శ్రీరాముడు , పాండవులు వచ్చినంత బలంగా తిరిగి రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. రెండు సంవత్సరాల క్రితం మా నాన్న వ్యాపారాల నుంచి రిటైర్ అయ్యారు. ఈ పరిస్థితుల్లో రాజకీయాలను, నా వ్యాపారాలను సమన్వయం చేసుకోవడం చాలా కష్టమవుతోంది. అందుకే తాత్కాలికంగా రాజకీయ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.

 

Share this post

submit to reddit
scroll to top
స్రవంతి చొక్కారపు సోకుల విందు.. ఫుల్ డోస్‌తో సెగలు పుట్టించేస్తుందిగా! స్టన్నింగ్ లుక్స్‌తో సెగలు పుట్టిస్తున్న శ్రద్ధా కపూర్ సోకుల విందుతో మైమరిపిస్తున్న శ్రీముఖి సొగసైన అందాలతో మైమరిపిస్తున్న దేవర బ్యూటీ జాన్వీకపూర్ సొగసులతో సెగలు పుట్టిస్తున్న సంయుక్త..