ఈ నెల 21న తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో ప్రధానంగా రైతుల పంట రుణాల మాఫీపై చర్చించనున్నారు. ఆగస్టు 15వ తేది లోగా వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. రుణమాఫీకి సుమారు రూ. 30 వేల కోట్లు, రైతు భరోసాకు మరో రూ. 7వేల కోట్లు అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో నిధుల సేకరణ, మార్గదర్శకాలపై మంత్రివర్గంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. మరో వైపు అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ రూపకల్పన , పంటల బీమా తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
రైతుల పంట రుణాలపై ఈ నెల 21న తెలంగాణ క్యాబినెట్ భేటీ
