ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. ఈ భేటీలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా తెలుగు ప్రజలకు మేలు చేకూర్చే రోడ్లు, జలవనరులు, రైల్వే లైన్లపై ఇద్దరు చర్చించారు. రైల్వే లైన్‌తో రెండు రాష్ట్రాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. బొగ్గు రవాణాతో పాటు పుణ్యక్షేత్రాల సందర్శనం సులభమవుతుందని చంద్రబాబు దృష్టికి తుమ్మల తీసుకువచ్చారు. భద్రాచలం ఐదు గ్రామాల విలీనం అవశ్యకతను మంత్రి తుమ్మల సీఎం చంద్రబాబుకు వివరించారు. అటు పట్టిసీమ నుంచి పులిచింతల లింక్‌తో రాయలసీమకు నీటి కష్టాలు తీరుతాయన్నారు. . వీటిలో పాలు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ అంశాలపై కూడా చర్చించారు.