ఉపాధి కూలీలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు ఇస్తున్న కనీస వేతనాన్ని రూ. 300లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నుంచి మొదలైయ్యే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమలులోకి వస్తుంది. ఇప్పటివరకు రూ. 272 కనీస వేతనంగా కూలీలకు ఇస్తున్నారు. దీనికి అదనంగా మరో రూ. 28 కలిపి 2024-25 సంవత్సరానికి రూ.300గా నిర్ణయించింది.