సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాహనదారులకు ఉపశమనం కలిగించే శుభవార్తను ప్రకటించింది. దేశావ్యాప్తంగా ఉన్న అధిక ఇంధన ధరలకు కాస్త తగ్గించింది. పెట్రోల్ , డీజిల్‌పై రూ. 2 చొప్పున తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అమలులోకి వస్తాయని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరించినట్లు సమాచారం ఇచ్చాయని పేర్కొంది.
వాహనదారులకు కేంద్రం శుభవార్త.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు
