ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారాన్ని జి.ఎ.డి అధికారులు ఖండించారు. అవన్నీ అవాస్తవాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఎవరైనా ఇబ్బందుల పాలు చేసినా, అసభ్యకరంగా మాట్లాడినా, దురుసుగా ప్రవర్తిస్తే సహించేదిలేదన్నారు. ఉద్యోగి విధులకు అటంకం కలిగించినా, ఉద్యోగులపై చేయి చేసుకున్న, IPC సెక్షన్ల క్రింద చర్య తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హెచ్చరించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని జి.ఎ.డి అధికారులు వివరణ ఇచ్చారు.