తెలంగాణలో వెల్‌స్పన్ గ్రూప్ పెట్టుబడులు.

Welspun World

తెలంగాణాలో Welspun World గ్రూప్ మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వెల్‌స్పన్ గ్రూప్‌ ఛైర్మన్ బి.కె. గోయెంకా, సంస్థ ఇతర ప్రతినిధులు సమావేశమైయ్యారు. పరిశ్రమల అభివృద్ధికి, పెట్టుబడులను ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఫ్రెండ్లీ పాలసీని అనుసరిస్తుందని తెలిపారు. తమ ప్రభుత్వ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని సీఎం వెల్లడించారు.

తమ కంపెనీ భవిష్యత్తులో చందన్‌వెల్లి పారిశ్రామిక వాడలో ప్రారంభించబడిన IT సేవలలో రూ. 250 కోట్ల పెట్టుబడి పెడతామని గోయెంకా తెలిపారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలలో ఐటి రంగాన్ని అభివృద్ధిపరిచేందుకు, వికారాబాద్, అదిలాబాద్ జిల్లాల్లోని యువతకు IT ఉద్యోగాలను కల్పించేందుకు తమ కంపెనీ సిద్ధంగా ఉన్నదని చెప్పారు.

Share this post

submit to reddit
scroll to top