రాష్ట్రంలో ఎక్కడా చూసినా అభివృద్ధి కనిపించడంలేదని ఆరోపించారు ఎంపీ బాలశౌరి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధాని అమరావతికి మద్దతు ఇచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చాక మాట మార్చారని విమర్శించారు. వైసీపీకి గుడ్ బై చెప్పిన ఆయన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిని మార్చేది లేదని చెప్పి 2019లో ఓట్లు అడిగింది గుర్తులేదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతున్నారో చెప్పాలని జగన్‌ను నిలదీశారు . వందల కోట్లు ఖర్చు పెట్టీ మరి.. సిద్ధం మీటింగ్‌లు పెడుతున్నారు. ఇంతకీ వైసీపీ దేనికి సిద్ధం ..? పారిపోవడానికి సిద్ధమా అని సెటైర్లేశారు. రానున్న రోజుల్లో జగన్ బండారం మొత్తం బయటపెడతానని బాలశౌరి అన్నారు.
ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నావ్ జగన్ : ఎంపీ బాలశౌరి
