జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా ఆమె కలిశారు. తన కుమారుడు వైఎస్ రాజా రెడ్డి వివాహానికి హాజరుకావాలని కోరుతూ ఆహ్వానపత్రికను అందజేశారు. ఈ సమావేశం సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై కూడా ఇరువురు చర్చించినట్లు సమాచారం. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా నియమితులైన సందర్భంగా షర్మిలకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు పవన్ కల్యాణ్.
పవన్ కల్యాణ్‌తో వైఎస్ షర్మిల భేటీ

YS Sharmila met with Pawan Kalyan