సీఎం జగన్ వైఎస్ఆర్ వారసుడు కాదు : షర్మిల

YS Sharmila on YS Jagan mohan reddy

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ పాలనపై విమర్శనాస్త్రాలు సందించారు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైయ్యారని ఆరోపించారు. వైఎస్ఆర్ ఆశయాలను తుంగలో తొక్కారని విమర్శించారు.
ఎడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి.. ఈ కడప బిడ్డ పులివెందుల పులి.. తెల్లని పంచే కట్టు.. మొహం నిండా చిరునవ్వు అని అన్నారు. ఇవ్వాళ్టి వరకు తెలుగు ప్రజల గుండెల్లో ఆయనది చెరగని ముద్ర అని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి అంటే ఇలా పని చేయాలని నిరూపించిన నాయకుడని గుర్తు చేశారు. ఇది YSR మార్క్.. రాజకీయం. ఆయన పథకాలే ఒక మార్క్. YSR ఆశయాలను కొనసాగించలేనీ ప్రస్తుత ప్రభుత్వం ఆయన వారసులు ఎలా అవుతారు..? జగన్ అన్నకి నేను వ్యతిరేకి కాదు.. కానీ జగనన్న అప్పటి మనిషి కాదు. రోజుకో జోకర్ ను తెచ్చి నాపై బురద చల్లుతున్నారు. నేను ప్రజల సమస్యల మీద మాట్లాడుతున్నా.. హామీల వైఫల్యాల మీద మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. ఎవరెంత నిందలు వేసినా.. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు జరిగే వరకు, ప్రత్యేక హోదా వచ్చే వరకు.. ఇక్కడ నుంచి కదలను.. పోలవరం వచ్చే వరకు కదలను గుర్తుపెట్టుకోండని వైసీపీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.

 

Share this post

submit to reddit
scroll to top
స్రవంతి చొక్కారపు సోకుల విందు.. ఫుల్ డోస్‌తో సెగలు పుట్టించేస్తుందిగా! స్టన్నింగ్ లుక్స్‌తో సెగలు పుట్టిస్తున్న శ్రద్ధా కపూర్ సోకుల విందుతో మైమరిపిస్తున్న శ్రీముఖి సొగసైన అందాలతో మైమరిపిస్తున్న మీనాక్షి చౌదరి సొగసైన అందాలతో మైమరిపిస్తున్న దేవర బ్యూటీ జాన్వీకపూర్